మెట్ల పూజ మిస్సయ్యాం.. సీఎం కాన్వాయ్ బాధితుల ఆవేదన - MicTv.in - Telugu News
mictv telugu

మెట్ల పూజ మిస్సయ్యాం.. సీఎం కాన్వాయ్ బాధితుల ఆవేదన

April 21, 2022

13

ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం తిరుమల వెళ్తున్న భక్తుల ఇన్నోవా కారును పోలీసులు లాక్కున్న విషయం తెలిసిందే. ఈ విషయం తెలిసిన వెంటనే సీఎం జగన్ అందుకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకున్నారు. శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ సస్పెండ్ చేశారు. ఇదిలా ఉండగా, బాధితుడు శ్రీనివాస్ స్పందిస్తూ.. పోలీసులు తీరు వల్ల చాలా ఇబ్బంది పడ్డామని తెలిపారు. భద్రత కోసం ఆర్టీసీ బస్టాండులో తల దాచుకున్నామని వెల్లడించారు. తర్వాత వేరే వాహనం అద్దెకు తీసుకొని తిరుమల చేరుకున్నామని వెల్లడించారు. పోలీసులు కారు తీసుకున్న నేపథ్యంలో మెట్ల పూజ మిస్సయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు.