CM Jagan deposited money in the account of Vahana Mitra beneficiaries
mictv telugu

వాహన మిత్ర లబ్దిదారుల అకౌంటులో డబ్బు జమ చేసిన జగన్

July 15, 2022

ఏపీలో ప్రభుత్వం అమలు చేస్తున్న వాహన మిత్ర పథకం లబ్దిదారుల అకౌంటులో సీఎం జగన్ బటన్ నొక్కి డబ్బ జమ చేశారు. ఒక్కో ఖాతాలో రూ. 10 వేల చొప్పున మొత్తం రూ. 261.51 కోట్లను విడుదల చేశారు. దీంతో ఇప్పటివరకు ఈ పథకం కింద నాలుగు విడతల్లో మొత్తం రూ. 1026 కోట్లు ఇచ్చినట్టయింది. ఈ సందర్భంగా విశాఖపట్టణంలో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడారు. ‘తమది పేదల ప్రభుత్వం. ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఈ పథకాన్ని ప్రారంభించాం. కరోనా సమయంలో కూడా ఈ పథకాన్ని కొనసాగించాం. ఎక్కడ కూడా లంచాలు, వివక్ష లేదు. కులం చూడలేదు, పార్టీ చూడలేదు. వైసీపీకి ఓటు వేయని వారు కూడా అర్హత ఉంటే పథకం కింద లబ్దిపొందుతున్నారు. అప్పటి ప్రభుత్వానికి, ఇప్పటి ప్రభుత్వానికి ఉన్న తేడా ఇదే’నని వ్యాఖ్యానించారు.