CM Jagan did a review meeting on the power department
mictv telugu

మోటార్లకు మీటర్లు బిగిస్తే లాభమే.. సీఎం జగన్

July 28, 2022

CM Jagan did a review meeting on the power department

వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడంపై సీఎం జగన్ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. మోటార్లకు మీటర్లు బిగించడం వల్ల కలిగే ప్రయోజనాలు పేర్కొంటూ రైతులకు లేఖలు రాయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనివల్ల రైతులపై అదనంగా ఒక్క రూపాయి కూడా భారం పడదనీ, విద్యుత్ బిల్లును ప్రభుత్వమే చెల్లిస్తుందనే విషయాన్ని తెలియజేయాలన్నారు. గురువారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో విద్యుత్ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళంలో చేపట్టిన పైలెట్ ప్రాజెక్టు విజయవంతం అయిందని అభిప్రాయపడ్డారు.

ఆ జిల్లాలో మీటర్లు పెట్టడం వల్ల 33.75 మిలియన్ల విద్యుత్ ఆదా అయిన విషయాన్ని ప్రముఖంగా చర్చించారు. ‘మీటర్లు పెట్టడం వల్ల మోటార్లు కాలిపోవు. ఎంత కరెంటు కాలుతుందో లెక్క తేలుతుంది. నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతుందనే విషయాన్ని రైతులకు అర్దమయ్యేలా చెప్పాలి. వ్యవసాయ పంపుసెట్లకు దరఖాస్తు చేసుకుంటే వెంటనే మంజూరు చేయండి. ఎక్కడ ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయినా వెంటనే రీప్లేస్ చేయాలి. పవర్ ప్లాంట్లకు ఒప్పందం ప్రకారం బొగ్గు సరఫరా జరిగేటట్లు చూడాల’ని జగన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాఖ ఉన్నతాధికారులు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు.