ఎకరాకు 30 వేలు.. రాయలసీమ రైతులకు సీఎం జగన్ బంపర్ ఆఫర్ - MicTv.in - Telugu News
mictv telugu

ఎకరాకు 30 వేలు.. రాయలసీమ రైతులకు సీఎం జగన్ బంపర్ ఆఫర్

September 28, 2022

నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కలవటాల వద్ద సీఎం జగన్ రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో జగన్.. రాయలసీమ రైతులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఎకరాకు రూ. 30 వేలను ప్రభుత్వం లీజుగా చెల్లిస్తుందని వెల్లడించారు. ప్రభుత్వానికి భూమి లీజుకు ఇస్తే అందులో సౌర, పవన విద్యుత్ తయారీ యూనిట్లు స్థాపిస్తామని, అలాగే మూడేళ్లకు ఒకసారి 5 శాతం లీజు రేటు పెంచుతామని ప్రకటించారు.

ఒకే చోట కనీసం 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగేలా భూములు సేకరించాలని, రైతులతో మాట్లాడి ఒప్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రతిపాదనకు అంగీకరించి భూములు ఇచ్చేలా ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని కోరారు. కాగా, కొండ ప్రాంతాలు, నీటి సౌకర్యం అంతగా లేని భూములను ముందుగా సేకరించే అవకాశముందని తెలుస్తోంది.