CM Jagan has given green signal to fill 6511 police posts
mictv telugu

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోలీస్ జాబుల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్

October 20, 2022

CM Jagan has given green signal to fill 6511 police posts

ఏపీలోని నిరుద్యోగులకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో 6,511 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయించారు. వాటి కోసం నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. కొన్నేళ్లుగా నోటిఫికేషన్ కోసం ఉద్యోగార్ధులు నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు.

సీఎం తాజా నిర్ణయంతో దీపావళి పండుగకు ముందు వారికి ఊరట కలిగించినట్టయింది. అటు నోటిఫికేషన్ విడుదల కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. త్వరలో ఏఏ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయో వివరాలతో కూడిన ప్రకటన జారీ చేస్తామని తెలిపారు. నిరుద్యోగులు పక్కా ప్రణాళికతో సిద్ధం కావాలని, కష్టపడి జాబ్ సాధించాలని సూచించారు. నియామకాలన్నీ పారదర్శకంగా ఉంటాయని వెల్లడించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు గుంజి మోసం చేసేవారిని నమ్మవద్దని అభ్యర్ధులను కోరారు.