CM Jagan has launched the new Jagananna videshee vidya deevena scheme
mictv telugu

ఏపీలో కొత్తగా జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం.. ఈ అర్హతలుండాలి

July 12, 2022

CM Jagan has launched the new Jagananna videshee vidya deevena scheme

ఇప్పటికే పలు సంక్షేమ పథకాలను అమల్లోకి తెచ్చిన ఏపీ ప్రభుత్వం తాజాగా విదేశాల్లో చదివే విద్యార్ధుల కోసం కొత్తగా ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ పథకాన్ని ప్రకటించింది. క్యూఎస్ ర్యాంకింగ్స్‌లో విదేశాల్లోని టాప్ 200 కాలేజీలు, యూనివర్సిటీల్లో సీటు సంపాదించిన విద్యార్ధులు ఈ పథకానికి అర్హులు. అంతేకాక, ఈ పథకాన్ని రూ. 8 లక్షల ఆదాయం ఉన్న అగ్రవర్ణ పేదలకు కూడా వర్తింపజేశారు. 100 కాలేజీల్లో పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్, 100 నుంచి 200 వరకు ఉన్న కాలేజీల్లో 50 శాతం వరకు నాలుగు విడుతల్లో నేరుగా బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు.

దీనికి 35 ఏళ్లు వయసున్న ప్రతీ ఒక్కరూ అర్హులు కాగా, కుటుంబంలో కేవలం ఒకరికే ఈ పథకం వర్తిస్తుంది. పై నిబంధనలతో రాష్ట్రంలో ఎంతమంది విదేశీ చదువులు చదివినా పరిమితులు లేకుండా ఈ పథక ప్రయోజనం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, గత టీడీపీ హయాంలో అమలైన ఇలాంటి పథకం కింద దాదాపు రూ. 318 కోట్లు బకాయిలు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది.