CM Jagan held a review meeting on schools
mictv telugu

విద్యార్ధులకు సీఎం జగన్ ఆఫర్.. ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబరు

September 12, 2022

CM Jagan held a review meeting on schools

పాఠశాల స్థాయిలో సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటి నిర్వహణలో సచివాలయ సిబ్బందిని కూడా భాగస్వాములను చేశారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సోమవారం విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన జగన్.. పాఠశాలలకు కల్పించిన సౌకర్యాలు బాగున్నాయా? లేదా? అని పరిశీలన చేయాలని ఆదేశించారు.

అవసరమైన చోట వెంటనే మరమ్మత్తులు, పనులు చేయించాలని సూచించారు. పాఠశాల మెయింటెనెన్స్ ఫండ్ వాడుకొని ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని వివరించారు. ఈ సందర్భంగా నాడు – నేడు పాఠశాలల ఆడిట్ నివేదికను అధికారులు అందజేయగా, ప్రతీనెలా ఆడిట్ చేయాలని సీఎం చెప్పారు. విద్యార్ధులకు ఇచ్చే ట్యాబులలో బైజూస్ కంటెంట్ వేయించి ఇవ్వాలని స్పష్టం చేశారు. అలాగే వచ్చే ఏడాది స్కూళ్లు తెరిచే నాటికి పిల్లల చేతికి విద్యాకానుక కచ్చితంగా అందజేసేలా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. ప్రతీవారం వెల్ఫేర్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్, మహిళా పోలీసు పాఠశాలను సందర్శించాలని, నెలకోసారి ఏఎన్ఎం వెళ్లాలని ఆదేశించారు. అలాగే ప్రతీ పాఠశాలలో టోల్ ఫ్రీ నంబరు 14417 విద్యార్ధులకు కనిపించేలా ప్రదర్శించాలని, ఎలాంటి సమస్యలున్నా విద్యార్ధులు ఈ నంబరుకి ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. తరగతుల డిజిటలీకరణలో భాగంగా స్మార్ట్ టీవీలు, ఇంటరాక్ట్ టీవీలు ఏర్పాటు చేయాలని, ప్రతీ పాఠశాలకి ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలని ఆదేశించారు.