డిక్లరేషన్ ఇవ్వకుండానే శ్రీవారి సన్నిధిలోకి జగన్  - MicTv.in - Telugu News
mictv telugu

డిక్లరేషన్ ఇవ్వకుండానే శ్రీవారి సన్నిధిలోకి జగన్ 

September 23, 2020

CM Jagan in the presence of tirumala without giving a declaration

తిరుమలకు అన్య మతస్తులు ఎవరు వచ్చినా ఓ లేఖ రాసి డిక్లరేషన్ ఇవ్వాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్న విషయం తెలిసిందే. ఈ డిక్లరేషన్‌కు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా మినహాయింపు కాదని అంటున్నారు. అయితే డిక్లరేషన్‌ ఇవ్వకుండానే సీఎం జగన్ శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించారు. అనంతరం ఆయన శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తొలుత సంప్రదాయ వస్త్రధారణతో జగన్ నుదుట నామాలు పెట్టుకుని ఆలయంలోకి ప్రవేశించారు. అనంతరం బేడీ ఆంజనేయస్వామి ఆలయంలో జగన్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించాక, వకుళమాతను దర్శించుకుని విమాన ప్రాకారం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. 

ఆ తర్వాత రంగనాయక మండపానికి చేరుకుంటారు. అక్కడ వేద ఆశీర్వచనాలు తీసుకుని.. సంపంగి ప్రాకారంలో నిర్వహించనున్న గరుడవాహన సేవలో పాల్గొననున్నారు. కాగా, బ్రహ్మోత్సవాల వేళ తిరుమల డిక్లరేషన్ వ్యవహారం మరింత ముదురుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. బీజేపీపై విమర్శలు సంధిస్తున్నారు. డిక్లరేషన్, సతీసమేతంగా స్వామి దర్శనం అంశాలపై నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘మోదీ తన భార్యతో కలిసి వస్తారా?  జగన్ తన భార్యతో తిరుమలకు వెళ్తే టీడీపీ, బీజేపీకి ఎందుకు అభ్యంతరం? బీజేపీ నాయకుల కారణంగా మోదీ బజారున పడుతున్నారు. జగన్ భార్య గురించి మాట్లాడేవాళ్లు మోదీని భార్యతో సహా గుళ్లకు రమ్మనండి’ అని కొడాలి నాని అన్నారు.