కానిస్టేబుల్ ఉద్యోగాలకు పోటీ పడుతున్న అభ్యర్ధులకు ఏపీ సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. వయోపరిమితి సడలింపుపై సానుకూల నిర్ణయం తీసుకున్నారు. వయోపరిమితిని రెండేళ్లకు పెంచుతూ ఊరటనిచ్చారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీనివల్ల చాలా మంది అభ్యర్ధులకు పోటీ పడేందుకు వీలు కలుగుతుంది. కాగా, ప్రభుత్వం 6,511 పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. వాటిలో 411 ఎస్సై పోస్టులు ఉన్నాయి. 6100 కానిస్టేబుల్ పోస్టులలో 3,580 సివిల్, 2,520 ఏపీఎస్పీ పోస్టులు ఉన్నాయి. కరోనా వల్ల రెండేళ్లు గ్యాప్ రావడంతో ఆ మేరకు పెంచాలని అభ్యర్ధులు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.