రోజా పంచులకు సీఎం జగన్ నవ్వులు - MicTv.in - Telugu News
mictv telugu

రోజా పంచులకు సీఎం జగన్ నవ్వులు

March 8, 2022

09

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో నగరి ఎమ్మెల్యే రోజా పంచులతో రెచ్చిపోయారు. ఇటీవల వచ్చిన తెలుగు సినిమా డైలాగులతో ముఖ్యమంత్రిని పొగుడుతూ.. ప్రతిపక్షాన్ని ఒక రేంజ్‌లో ఆడుకున్నారు. రోజా స్పీచ్‌కు వేదికపైనే ఉన్న జగన్ సైతం నవ్వకుండా ఉండలేకపోయారు. ‘ఎవడు పడితే వాడు ఓడిస్తానంటే ఇది మీ అడ్డా కాదు బిడ్డా.. ఇది ఆంధ్రా గడ్డ, జగనన్న అడ్డా’ అంటూ మొదలెట్టడంతో సభలోని మహిళలు కేరింతలతో చప్పట్లు కొట్టారు. ‘ ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో.. అతనే జగన్ మోహన్ రెడ్డి’ అంటూ ఎప్పుడు ఎన్నికలు జరిగినా వార్ వన్ సైడేనంటూ ధీమా వ్యక్తం చేశారు. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకొని, తోక పార్టీలను కలుపుకుంటే సరిపోదనీ, ఇక్కడ ఉన్నది వైఎస్ జగన్ అంటూ టీడీపీని పరోక్షంగా ఎద్దేవా చేశారు. బాలకృష్ణ అఖండలోని డైలాగులను ఉటంకిస్తూ.. చంద్రబాబు ఎక్కడ.. జగన్ ఎక్కడ.. బోత్ ఆర్ నాట్ సేమ్, మహిళలకు అన్యాయం చేసిన చంద్రబాబు, అండగా నిలిచిన జగన్ బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ తన ప్రసంగంతో జనాలను ఆకట్టుకున్నారు.