టోల్‌ఫ్రీ నంబర్‌కు సీఎం జగన్ ఫోన్..! - MicTv.in - Telugu News
mictv telugu

టోల్‌ఫ్రీ నంబర్‌కు సీఎం జగన్ ఫోన్..!

November 18, 2019

CM Jagan.........

ఏపీలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులోకి తెచ్చింది. సోమవారం సీఎం జగన్ అధికారులతో కలిసి 14500 టోల్ ఫ్రీ నంబర్‌ను ప్రారంభించారు. ఇసుక అక్రమ నిల్వలు, అధిక ధరలకు ఎవరైనా అమ్మితే వెంటనే ఫోన్ చేసి ఫిర్యాదు చేసే విధంగా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు.   

ఈ టోల్ ఫ్రీ అందుబాటులోకి వచ్చిన వెంటనే ముందుగా సీఎం జగన్ కాల్ చేశారు. కాల్ సెంటర్ ఉద్యోగులతో కొంత సేపు మాట్లాడారు. ఎవరు ఫిర్యాదు చేసినా వెంటనే స్పందించాలని సిబ్బందికి సూచించారు. ఏ మాత్రం అలస్యం జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. టాస్క్‌ఫోర్స్ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇసుక సరఫరా పూర్తి పారదర్శకంగా జరగాలని సూచించారు. కాగా గత ప్రభుత్వ పాలసీకి భిన్నంగా తమ ప్రభుత్వం ఇసుక విధాన్ని కొనసాగిస్తుందని సీఎం జగన్ ప్రకటించారు.