ఏపీలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. స్మశానాలు లేని దళిత వర్గ ప్రజలకు వెంటనే స్మశానాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రతీ కలెక్టర్ ఏ గ్రామంలో అయితే స్మశానం లేదో గుర్తించి 45 రోజుల్లో సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఇందుకోసం ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అలాగే, స్మశాన వాటిక అందుబాటులో లేని దళిత వర్గ ప్రజలు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.