నిరుద్యోగులకు అలర్ట్.. 1010 ఉద్యోగాలకు సీఎం పచ్చ జెండా - MicTv.in - Telugu News
mictv telugu

నిరుద్యోగులకు అలర్ట్.. 1010 ఉద్యోగాలకు సీఎం పచ్చ జెండా

November 18, 2022

ఏపీ సీఎం జగన్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే 1010 ఉద్యోగాలను భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ, హాస్టళ్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గతంలో ఇచ్చిన ఆదేశాల అమలు తీరును, వాటి వివరాలను తెలుసుకున్నారు. నాడు, నేడు కార్యక్రమంలో భాగంగా సంక్షేమ హాస్టళ్లకు రూ. 1500 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు.

ఇక సంక్షేమ హాస్టళ్లలో సరిపడా సిబ్బంది ఉండాలని, అందులో భాగంగా 759 సంక్షేమ అధికారులు, 80 మంది కేర్ టేకర్లను భర్తీ చేయాలని ఆదేశించారు. ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాల్లో 171 హాస్టల్ వెల్ఫేర్ అధికారులు, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో క్లాస్ 4 ఉద్యోగుల నియామకంపై దృష్టి సారించాలని సూచించారు. ఇలా మొత్తం 1010 పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించారు.