CM Jagan pays tribute to superstar Krishna's body
mictv telugu

మహేష్‌కి ధైర్యం చెప్పిన సీఎం జగన్

November 16, 2022

సూపర్‌ స్టార్‌ కృష్ణ భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు పద్మాలయ స్టూడియోకి ప్రముఖులు, అభిమానులు భారీగా తరలివస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృష్ణ భౌతికాయనికి నివాళులర్పించారు. అనంతరం ఘట్టమనేని కుటుంబ సభ్యులను పరామర్శించారు. మహేష్ బాబుని ఆలింగనం చేసుకొని ధైర్యం చెప్పారు. పక్కనే ఉన్న గల్లాజయదేవ్‌తోని సీఎం జగన్ మాట్లాడారు.ఇతర కుటుంబ సభ్యులను పేరుపేరునా పలకరించారు. ఇదే క్రమంలో అక్కడే ఉన్న హీరో బాలకృష్ణతో కూడా మాటలు కలిపారు జగన్. తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో మధ్యాహ్నం తరువాత మహా ప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి. పద్మాలయా స్టూడియోస్ నుంచి అంతిమయాత్ర ప్రారంభమవుతుంది.