CM Jagan released Ammoodi money in srikakulam
mictv telugu

అమ్మఒడి డబ్బులు విడుదల.. హాజరు శాతంపై కీలక వ్యాఖ్యలు

June 27, 2022

ఏపీలో ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మఒడి పథకం డబ్బులు సోమవారం విడుదల అయ్యాయి. శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి మైదానంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్.. మొత్తం రూ. 6595 కోట్లను తల్లుల ఖాతాలో జమ చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ..‘విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాం. పేద వారు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో నేరుగా నిధులను జమ చేస్తున్నాం. ఈ పథకం కింద ఇప్పటివరకు రూ. 19, 618 కోట్లను రిలీజ్ చేశాం. పిల్లలు బాగా చదవాలనే తలంపుతో 75 శాతం హాజరు విధానాన్ని పెట్టా’మని వెల్లడించారు. అటు రూ. 2 వేలు కట్ చేయడంపై సీఎం జగన్ స్పందించారు. పాఠశాలల్లో టాయిలెట్ల శుభ్రత, భవనాల మరమ్మత్తులకు కొంత డబ్బు తీసుకుంటే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని ఎద్దేవా చేశారు.