నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షో సందర్భంగా జరిగిన ప్రమాదంలో 8 మంది చనిపోవడంపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడ్డ వారికి రూ. 50 వేల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. ఏపీ గవర్నర్ ప్రమాదంపై విచారం వ్యక్తం చేసి.. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రధాని మోదీ టీడీపీ కార్యకర్తల మృతిపై కలత చెందారు. వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేలు మంజూరు చేస్తున్నట్లు pmo ట్వీట్ చేసింది. మృతుల కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ తరపున రూ.10 లక్షల ఎక్స్గ్రేసియాను చంద్రబాబు ప్రకటించారు. వారి పిల్లలకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా చదివిస్తామని హామీ ఇచ్చారు. ఇవాళ జరగనున్న మృతుల అంత్యక్రియల్లో చంద్రబాబు పాల్గొననున్నారు.