పీవీ సింధుకు కూడా చంద్రబాబే ఆట నేర్పించా అంటారు : జగన్
మాజీ సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ పై సీఎం జగన్ మరోసారి విమర్శలు గుప్పించారు. అనకాపల్లి జిల్లాలోని నర్నీపట్నంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం.. నియోజకవర్గంలో రూ.986 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా పవన్, చంద్రబాబులను టార్గెట్ చేశారు. రాష్ట్రంలో చెడిపోయిన వ్యవస్థతో యుద్ధం చేస్తున్నామని జగన్ అన్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై బురద జల్లడమే పని పెట్టుకున్నారని విమర్శించారు. పెన్షన్ పై అసత్యం ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ భార్యకాకపోతే ఆ భార్య
చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టునే పవన్ చదువుతారని సీఎం ఆరోపించారు. దత్తపుత్రుడిని నెత్తిన పెట్టుకుని చంద్రబాబు ఊరోగిత్తున్నారని జగన్ అన్నారు. ‘వారికి ఈ రాష్ట్రం కాకపోతే..మరో రాష్ట్రం. ఈ ప్రజలు కాకపోతే.. ఆ ప్రజలు. ఈ భార్య కాకపోతే..ఆ భార్య’ అని వ్యాఖ్యానించారు. ఎక్కడా ఏ మంచి పని జరిగినా తనవల్లే జరిగిందని చంద్రబాబు చెప్పుకుంటారని తెలిపారు. చివరికి సింధు గెలిచినా కూడా బ్యాడ్మింటన్ తానే నేర్పినట్లు చెప్పుకుంటారని జగన్ ఎద్దేవ చేశారు. చంద్రబాబు పేరు చెబితే వెన్నుపోటు, మోసాలు గుర్తుకువస్తాయన విమర్శించారు. రాజకీయాల్లోకి వచ్చి 14 ఏళ్లు అవుతున్నా పవన్ కళ్యాణ్‌కు ఒక్క ఎమ్మెల్యే కూడా లేరన్నారు. రెండు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్ల ప్రజలు ఆయనను ఓడించారని తెలిపారు. పవన్ కళ్యాణ్‌కు నిర్మాత, దర్శకుడు చంద్రబాబు అని జగన్ విమర్శించారు. చంద్రబాబు ఎప్పుడు షూటింగ్ అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ కాల్‌షీట్లు ఇస్తాడని.. ఎక్కడ షూటింగ్ అంటే అక్కడకు వస్తాడని చెప్పారు.
ఇవి కూడా చదవండి :
ఏపీ పదోతరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
నన్ను కోవర్ట్ అన్న కాంగ్రెస్సోడిని చెప్పుతో కొడతా….ఎమ్మెల్యే జగ్గారెడ్డి విశ్వరూపం