cm jagan speech in vishaka modi program
mictv telugu

మోడీతో నా అనుబంధం రాజకీయాలకు అతీతం :జగన్

November 12, 2022

విశాఖలోని మోడీ సభలో సీఎం జగన్ మరోసారి విభజన హామీలపై గళం విప్పారు. విభజన గాయం నుంచి ఇంకా ఏపీ కోలుకోలేదని, ఏపీని తగిన విధంగా కేంద్రం ఆదుకోవాలని ప్రధానిని సీఎం కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం, విభజన హామీలు, స్టీల్ ప్లాంట్‌ల విజ్ఞప్తులను సీఎం జగన్ గుర్తు చేశారు. మోడీతో తమది ప్రత్యేక అనుబంధమన్నారు జగన్. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా తమ బంధం ఉంటుందని తెలిపారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మరొక అజెండా ఉండదని చెప్పారు. ఏపీలో ప్రతీ ఇళ్లు నిలదొక్కుకునేలా ముందుకు అడుగులు వేస్తున్నామని .. మంచి చేసే ప్రభుత్వానికి ప్రజల దీవెనలు, పెద్దలైన మోడీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు జగన్ స్పష్టం చేశారు.