గురువారం తిరుపతి పర్యటనకు వచ్చిన సీఎం జగన్ వకుళ మాత ఆలయంతో పాటు పలు పరిశ్రమలకు ప్రారంభోత్సవం చేశారు. టీసీఎల్, ఫాక్స్ లింక్, డిక్సన్ టెక్నాలజీస్ సంస్థల యూనిట్లను ప్రారంభించారు. అడిడాస్ షూ కంపెనీ అపాచీ పరిశ్రమకు శంఖుస్థాపన చేశారు. దీంట్లో 800 కోట్ల పెట్టుబడి, పదివేల మందికి ఉపాధి లభించనున్నాయి. ఇందులో 80 శాతం ఉద్యోగాలు మహిళలకే వస్తాయి. జగన్ ఇవ్వాళ ఒక్కరోజే ప్రారంభించిన కంపెనీల పెట్టుబడి విలువ రూ. 20 వేల కోట్లు కాగా, మొత్తంగా 20000 వేల మందికి ఉపాధి లభిస్తుంది. దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలక్ట్రానిక్ అవసరాలు తీర్చేందుకు, రాష్ట్రాన్ని ఎలక్ట్రానిక్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ఈ ఒప్పందాలు ఎంతో కీలకం.