CM Jagan Strong Counter To CBN
mictv telugu

లాస్ట్ ఛాన్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్

November 23, 2022

టీడీపీ అధినేత చంద్రబాబు లాస్ట్ ఛాన్స్ సెంటిమెంట్‌కు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తనకు తాను పార్టీ పెట్టి అధికారంలోకి వస్తే వారిని ఎంజీఆర్,ఎన్టీఆర్, జగన్ అంటారని అన్నారు. సీఎం సీటు లాక్కునే వారిని చంద్రబాబు అంటాం అని సెటైర్లు వేశారు.రావణుడిని సమర్థించేవాళ్లను రాక్షసులంటాం..మోసం, వెన్నుపోటు పొడిచే వారికి ఎవరైనా చివరి అవకాశం ఇస్తారా అని ఆలోచించాలని ప్రజల్ని జగన్ కోరారు.

పొలిటికల్ హీట్

ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార, విపక్షాలు దూసుకుపోతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చివరి ఎన్నికల అస్త్రాన్ని తెరపైకి తెచ్చారు. 2024 ఎన్నికలే చివరి ఎన్నికలని, గెలువకపోతే మళ్లీ పోటీచేయని బాబు అన్నారు. ఎక్కడికెళ్లినా ఆయన ఇదే మాట చెబుతున్నారు. లాస్ట్ ఛాన్స్ సెంటిమెంట్‌ని బాగా వాడేస్తున్నారు. ఎలాగైనా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వర్కౌట్ చేయాలని చూస్తున్నారు.సినిమాల డైలాగ్‌లతో దంచికొడుతున్నారు. ఘాటైన పదాలు వాడుతూ చంద్రబాబు తన శైలిని మార్చి జనంలోకి వెళ్తున్నారు.

స్ట్రాంగ్ కౌంటర్

చంద్రబాబు దూకుడుని ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. బాబు చివరి ఎన్నికల అస్త్రంపై ముఖ్యమంత్రి జగన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. “తనకు తాను పార్టీ పెట్టి అధికారంలోకి వస్తే ఎంజీఆర్,ఎన్టీఆర్,జగన్ అంటారు.సీఎం సీటుని లాక్కునే వారిని చంద్రబాబు అంటాం. రావణుడ్ని సమర్థించే వాళ్లను రాక్షసులంటాం.మోసం, వెన్నుపోటు పొడిచే వారికి ఎవరైనా చివరి అవకాశం ఇస్తారా..ఆలోచించండి” అని జగన్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో రైతులకు భూ హక్కు పత్రాల్ని జగన్ పంపిణీ చేశారు. ప్రభుత్వ సంక్షేమపథకాల్ని వివరించిన జగన్…సగం సమయం చంద్రబాబుని తిట్టేందుకే కేటాయించారు.

పవన్‌ని వదలని జగన్

అటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. సీఎం కూర్చుని లాక్కుని , ప్రజల్ని మోసం చేస్తున్న వ్యక్తుల్ని పవన్ కల్యాణ్ సమర్థిస్తున్నారని మండిపడ్డారు. దుర్యోధనుడ్ని సమర్థించిన వాళ్లను దుష్టచతుష్టయం అంటాం..మరి వీళ్లను ఏమనాలి అని జగన్ ప్రశ్నించారు. మొత్తానికి ఏపీలో సెంటిమెంట్ వార్ నడుస్తోంది.