త్వరలో జరగబోయే మంత్రి వర్గ విస్తరణలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా, అందుకు కట్టుబడి ఉంటామని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తెలిపారు. శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. అనంతరం కుటుంబసభ్యులతో కలసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల నారాయణ మీడియాతో మాట్లాడుతూ పదిహేనేళ్ల తర్వాత వైఎస్ జగన్ ప్రధానమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. స్వామి వారి ఆశీస్సులు ఆయనకు ఉన్నాయని, తామంతా ఆయన అడుగులో అడుగేస్తామని వెల్లడించారు. మంత్రి పదవుల విషయంలో జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా, సంతోషంగా స్వీకరికస్తామని వివరించారు. చంద్రబాబుకు దమ్ముంటే సొంత పార్టీ పెట్టి ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు. టీడీపీకి నిజమైన వారసులు ఎవరో ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. కాగా, జగన్ ప్రధాన మంత్రి అవుతారని నారాయణ స్వామి చేసిన వ్యాఖ్యలు ఏపీలో ప్రస్తుతం చర్చనీయాంశమైంది.