చెల్లెకు కీలక పదవి ఇవ్వనున్న అన్న! - MicTv.in - Telugu News
mictv telugu

చెల్లెకు కీలక పదవి ఇవ్వనున్న అన్న!

September 22, 2019

CM Jagan...

‘జగన్ అన్న వదిలిన బాణాన్ని’ అంటూ వైసీపీ తరఫున ప్రచారం చేసిన షర్మిల రాజకీయాల్లో సంచలనంగా మారారు. ఎన్నికల్లో ఆమె చేసిన ప్రచారం పార్టీకి బాగా కలిసివచ్చిందనే చెప్పాలి. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌లకు కౌంటర్లు ఇచ్చారు. అన్నను ముఖ్యమంత్రిని చేయడంలో చెల్లెలి పాత్ర బలంగా వుంది. అయితే అనుకున్నట్టుగానే పదేళ్లు ప్రజల మధ్యే వున్న జగన్ అనేక కష్టాలు పడి ఏపీకి ముఖ్యమంత్రి అయ్యారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక షర్మిల కనిపించడంలేదు. ఆమె పార్టీ నుంచి ఎలాంటి పదవి ఆశించకుండా మౌనంగా వున్నారు. మరోవైపు జగన్ కూడా పదవులకు కుటుంబసభ్యులను దూరంగా పెడుతున్నారు. 

అయితే తాజా సమాచారం ప్రకారం త్వరలోనే షర్మిలకు వైసీపీలో కీలక పదవి దక్కే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యమంత్రిగా బిజీగా వున్న జగన్ పార్టీ బాధ్యతలను షర్మిలకు అప్పజెప్పాలనుకుంటున్నారట. వచ్చే పార్టీ ప్లీనరీ నాటికి వైసీపీలో ఆమెకు ఆ పదవి ఇవ్వాలని జగన్ ఆలోచిస్తున్నారని తెలుస్తోంది.