సీఎం జగన్ పర్యటనలో మార్పు..తిరుపతి నుంచి హైదరాబాద్‌కు - MicTv.in - Telugu News
mictv telugu

సీఎం జగన్ పర్యటనలో మార్పు..తిరుపతి నుంచి హైదరాబాద్‌కు

September 24, 2020

bncvn

ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి పర్యటన షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు జరిగాయి. ప్రస్తుతం శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఉన్న ఆయన తాడేపల్లికి వెళ్లకుండా నేరుగా హైదరాబాద్‌కు రానున్నారు. ప్రత్యేక విమానంలో ఉదయం 11.20 గంటలకు బేగంపేట ఏయిర్ పోర్టుకు చేరుకునేలా మార్పులు చేశారు. ఆయన భార్య భారతి తండ్రి ఈసీ గంగిరెడ్డి అనారోగ్యంతో ఉండటంతో పరామర్శించేందుకు వస్తున్నట్టుగా అధికారులు వెల్లడించారు.  

ఇటీవల గంగిరెడ్డి అనారోగ్యంతో హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరారు. దీంతో ఆయన్ను కలిసి పరామర్శించనున్నారు. ఆ వెంటనే తిరిగి మధ్యాహ్నం 1:20 గంటలకు విమానంలో గన్నవరం చేరుకొని అక్కడి నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి వెళ్లనున్నారు. కాగా, మూడు రోజులుగా ఆయన పర్యటన బిజీ బిజీగా సాగుతోంది. ఢిల్లీకి వెళ్లి పలువురు కేంద్ర మంత్రులను కలిసిన జగన్ నేరుగా తిరుమలకు వచ్చారు. అక్కడ బ్రహ్మోత్సవాలు సహా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్కడి నుంచి తాడేపల్లికి వెళ్లాల్సి ఉన్నా మార్పులు చేసుకోవాల్సి వచ్చింది.