గ్యాస్ లీకేజీ బాధితులను పరామర్శించిన సీఎం.. పేషెంట్ల కాళ్లు పట్టుకుని.. - MicTv.in - Telugu News
mictv telugu

గ్యాస్ లీకేజీ బాధితులను పరామర్శించిన సీఎం.. పేషెంట్ల కాళ్లు పట్టుకుని..

May 7, 2020

 

విశాఖలో గ్యాస్ లీక్ ఘటన ఎంతటి కలకలం రేపిందో తెలిసిందే. అమాయక ప్రజలు విష వాయువులు పీల్చి మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో బాధితులను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హుటాహుటిన వైజాగ్ వెళ్లారు. విశాఖలోని కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న  బాధితులను జగన్ పరామర్శించారు. దగ్గరికి వెళ్లి వారి పక్కనే కూర్చుని ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితుల్లో వృద్దులు, మహిళలు, చిన్న పిల్లలు ఉన్నారు. ఆసుపత్రిలోకి వెళ్లిన జగన్ ఓ వృద్ధుడి వద్దకు వెళ్లారు.  ఆయన రెండు మోకాళ్ల వద్ద పట్టుకుని ఎంతో ఆప్యాయంగా పలకరించారు.

ఓ ముఖ్యమంత్రి ఇలా బాధితుడిని ఆత్మీయంగా పలకరించడం చూసి అక్కడున్న రోగుల బంధువులు ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా.. గ్యాస్ లీక్ ఘటనలో చనిపోయినవారి కుటుంబాలకు రూ.కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా అందిస్తున్నట్టు ప్రకటించారు. ఓవైపు కరోనా మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో ముఖానికి మాస్కు ధరించి జగన్ వారిని పలకరించారు. ఈ సందర్భంగా జగన్ ఔదార్యానికి నెటిజన్లు ఫిదా అవుతన్నారు.