కోనసీమ అల్లర్లకు వాళ్లిద్దరే ముఖ్య కారణం.. జగన్ - MicTv.in - Telugu News
mictv telugu

కోనసీమ అల్లర్లకు వాళ్లిద్దరే ముఖ్య కారణం.. జగన్

June 14, 2022

ఏపీలోని కోనసీమ అల్లర్లపై ఆ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ తొలిసారి స్పందించారు. మంగళవారం సత్యసాయి పుట్టపర్తి జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి.. కొత్తపల్లిలో పంటల బీమా పరిహారాన్ని లబ్ధిదారులకు అందించారు.ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఒక జిల్లాకు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారని అన్నారు. దానిని కూడా రాజకీయం చేసి.. పచ్చని కోనసీమలో అల్లర్లు స్పష్టించారని మండిపడ్డారు. దళిత మంత్రి ఇంటిని తగలబెట్టారని సీఎం జగన్ మండిపడ్డారు. తమ మంత్రివర్గంలో 70 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలే ఉన్నారని సీఎం జగన్ వెల్లడించారు.

చంద్రబాబు తానా అంటే ఆయన దత్తపుత్రుడు తందానా అంటున్నారని జగన్ మండిపడ్డారు. ఉన్నది లేనట్లుగా.. లేనిది ఉన్నట్లుగా చేస్తారని చెప్పారు. ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తోడు దొంగలని విమర్శించారు. వీళ్లిద్దరు రాజకీయాల్లో ఉండటానికి అర్హులేనా? అని ప్రశ్నించారు. క్రాప్ హాలీ డే అంటూ కోనసీమ రైతులను రెచ్చగొడుతున్నారని సీఎం ఆరోపించారు.