CM Jagan will deposit crop damage compensation money in the accounts of AP farmers
mictv telugu

రైతులకు శుభవార్త.. 28న అకౌంట్లలో నగదు జమ

November 25, 2022

ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లో పంట నష్టపోయిన రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ వైరీత్యాల వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు ఈ నెల 28న అకౌంట్లలో నగదు జమ చేయనుంది. సీఎం వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ లో బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు.

ఆగస్టులో సంభవించిన గోదావరి వరదలతో పాటు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు కురిసిన అకాల వర్షాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా 45,998 మంది రైతులు 60,832 ఎకరాల్లో పంటలు నష్టపోయినట్టుగా ప్రభుత్వం గుర్తించింది. ఇందులో 34,292 ఎకరాలు వ్యవసాయ పంటలకు రూ. 18.95 కోట్లు, 26,540 ఎకరాల్లో ఉద్యాన పంటలకు రూ. 20.44 కోట్ల చొప్పున మొత్తం రూ. 39.39 కోట్లు పంట నష్టపరిహారం చెల్లించాలని అధికారులు లెక్క తేల్చారు. ఇక అదే రోజు ఈ ఏడాది ఖరీఫ్ సీజన్, గతేడాది ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి సున్నా వడ్డీ డబ్బులు రూ. 160.55 కోట్లు జమ చేయనున్నారు. సున్నా వడ్డీ, పంట నష్టపరిహారం మొత్తం కలిపి రూ. 199.94 కోట్లను రైతుల ఖాతాల్లో బదిలీ చేయనున్నారు.