CM Jagan will go to Delhi from Hyderabad
mictv telugu

నేడు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లనున్న సీఎం జగన్

August 6, 2022

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు రాత్రి హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు. మొదట శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు తాడేపల్లి నుంచి విశాఖకు బయల్దేరి అక్కడి నుంచి శ్రీకాకుళంలోని ఆముదాల వలస మైదానంలో జరిగే స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడి వివాహానికి హాజరవుతారు. అనంతరం సాయంత్రం 5.20 గంటలకు విశాఖ చేరుకుని అక్కడ నుంచి శంషాబాద్ చేరుకుంటారు. 6.55 గంటలకు నార్సింగిలోని ఓమ్ కన్వెన్షన్‌లో జరిగే జీవీ ప్రతాప్ రెడ్డి కుమారుడి వివాహానికి హాజరై రాత్రి 7.50 గంటలకు ఢిల్లీ బయల్దేరతారు. రాత్రికి వన్ జన్‌పథ్‌లో బస చేసి ఆదివారం ఉదయం 9.30 గంటలకు రాష్ట్రపతి భవన్ చేరుకుంటారు. తర్వాత సాయంత్రం 4.30 గంటలకు నీతి అయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ ఏడవ సమావేశంలో పాల్గొని తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు. కాగా, ఎప్పుడూ గన్నవరం నుంచి ఢిల్లీ వెళ్లే జగన్.. ఈ సారి వివాహాల కారణంగా హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు.