CM Jagan's big scam will be revealed in a week: Lokesh
mictv telugu

సీఎం జగన్ చేసిన పెద్ద కుంభకోణాన్ని వారంలో బయటపెడతా : లోకేశ్

August 16, 2022

CM Jagan's big scam will be revealed in a week: Lokesh

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళవారం సంచలన వార్త చెప్పారు. వారం రోజుల్లో ముఖ్యమంత్రి జగన్ చేసిన అతి పెద్ద కుంభకోణాన్ని బయటపెడతానని వెల్లడించారు. అందరికీ ఆరోగ్యమస్తు – ఇంటికి శుభమస్తు నినాదంతో మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్‌పై విమర్శలు గుప్పించారు. ‘జగన్‌వి పదోతరగతి పాస్, డిగ్రీ ఫెయిల్ తెలివితేటలు. ఈ మూడేళ్లలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమల కంటే వెళ్లిపోయినవే ఎక్కువ. ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే సీఎం వాటా ఎంత అనే చర్చ వస్తోంది. పరిశ్రమలపై శ్వేత పత్రం విడుదల చేస్తే చర్చకు నేను సిద్ధం. ఈడీ, ఐటీ, సీబీఐలకు భయపడి ఢిల్లీలో తలవంచార’ని ఆరోపించారు. కాగా, పేదలందరికీ ఉచిత వైద్యసేవలు అందించే ఈ ఆసుపత్రికి ఆరోగ్య సంజీవని అని పేరు పెట్టారు. ఇందుకు అవసరమైన సిబ్బంది, వైద్యులు, చికిత్స పరికరాలను సొంత ఖర్చుతో ఏర్పాటు చేశారు. ఇక్కడ దాదాపు 200 పైగా రోగాలకు ఉచితంగా రోగనిర్ధారణ పరీక్షలు చేయనున్నారు.