ఏపీ సీఎం జగన్ నేటి కడప పర్యటన రద్దైంది. కడప విమానాశ్రయం పరిసరాల్లో పొగమంచు దట్టంగా ఉండడంతో సీఎం పర్యటనకు ఆటంకం ఏర్పడింది. వాతవరణం అనుకూలంగా లేకపోవడంతో జగన్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. చాలా సేపు ఎయిర్ ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం వేచి చూసినా ఫలితం లేకపోవడంతో చివరికి పర్యటనను విరమించుకున్నారు. నేటి కడప పర్యటనలో అమీన్ పీర్ ఉర్సు ఉత్సవాల్లో సీఎం జగన్ పాల్గొనాల్సి ఉంది. ఈ మధ్యాహ్నం ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున రెడ్డి కుమార్తె పెళ్లి రిసెప్షన్ కు కూడా హాజరు కావాల్సి ఉంది.
2009 సెప్టెంబర్ 2న ఆదివారం రచ్చబండ కార్యక్రమాకి వెళ్లిన అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలీకాఫ్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే.దట్టమైన క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. వైఎస్సార్ మరణం.. అభిమానులకు ఇప్పటికీ ఓ చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది.