CM Jagan's speech was riddled with mistakes
mictv telugu

వామ్మో.. సీఎం జగన్ ప్రసంగంలో ఇన్ని తప్పులా!

August 16, 2022

CM Jagan's speech was riddled with mistakes

సీఎం జగన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంపై విమర్శలు వస్తున్నాయి. 45 నిమిషాలు పాటు సాగిన ఆయన ప్రసంగంలో అనేక తప్పులు దొర్లాయి. దాదాపు 20కి పైగా పదాలు తప్పుగా మాట్లాడగా, మరికొన్ని పదాలు చదవడంలో పొరబడి తర్వాత సరిదిద్దుకోవడం కనిపించింది.

స్వేద్వం, ఆర్ధిక స్వాలంబన, ఉటకించారు, సామాజిక అభద్రత, మహానుయోధులు, వజ్జోత్సవాలు, విప్లవాత్మిక, సుస్థిరాభివృద్ధి లక్షణాలు, అభ్యుద్వయం, నియాకం, గోదము, ఆవిర్భించాలి, కార్పొరేట్ విద్య సంస్థలు వంటి పొరపాట్లతో ఆద్యంతం తడబడుతూ సాగింది. అలాగే ఆర్ధికంగా అనేచోట హార్ధికంగా, ప్రతి పథకం అనేచోట ప్రతి పతకం అని సరిదిద్దుకున్నారు. ఇదిలా ఉంటే ఆ వేడుకల్లో అంతా సీఎం భజన ఎక్కువగా సాగింది. పదేపదే జగనన్న ప్రభుత్వం అంటూ శకటాల ప్రదర్శన సందర్భంగా కొనియాడారు.