ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వైజాగ్ టూర్ ప్రణాళిక ఖరారైంది. ఈ నెల 13వ తేదీ బుధవారం విశాఖపట్టణానికి రానున్నారు. అక్కడే వాహన మిత్ర పథకం లబ్దిదారులకు నిధులను వర్చువల్గా విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద ఒక్కో లబ్దిదారుడికి రూ. 10 వేలు ప్రభుత్వం ఇస్తున్న విషయం తెలిసిందే. కాగా, పర్యటనకు సంబంధించిన వివరాలను సీఎం కార్యాలయం వెల్లడించింది. 13న ఉదయం 10.30 గంటలకు విమానాశ్రయానికి చేరుకుంటారు. తర్వాత 11.05కు ఏయూ కాలేజీ గ్రౌండుకు చేరుకుంటారు. తర్వాత స్టాళ్లను సందర్శించి వాహన మిత్ర పథకం ఫొటో ఎగ్జిబిషన్ వీక్షిస్తారు. తర్వాత లబ్దిదారులతో ప్రసంగాలు, పథకం వీడియో ప్రదర్శన ఉంటాయి. 11.47 నుంచి మధ్యాహ్నం 12.17 వరకు సీఎం జగన్ మాట్లాడుతారు. 12.20కి పథకం చెక్కులను పంపిణీ చేస్తారు. 12.30 విమానాశ్రయానికి బయల్దేరి 12.55 నుంచి 1.15 వరకు స్థానిక పార్టీ నాయకులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. అనంతరం 1.20 గంటలకు గన్నవరం బయల్దేరి వెళ్తారు.