CM KCR among 5 MLAs across India with highest declared criminal cases: ADR report
mictv telugu

క్రిమినల్ కేసుల టాప్ లిస్టులో కేసీఆర్.. ఎన్నికల నిఘా సంఘాలు

July 13, 2022

CM KCR among 5 MLAs across India with highest declared criminal cases: ADR report

ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఎన్నికల సందర్భంలో చేసినట్లే ఇప్పుడు కూడా నేతల నేరచరితను బయటపెట్టాయి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్ఈడబ్ల్యూ) సంస్థలు. ప్ర‌జా ప్ర‌తినిధులుగా ఎన్నికై, రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేయబోయే వారిపై న‌మోదైన కేసులుకు సంబంధించి ఏడీఆర్, ఎన్ఈడబ్ల్యూ తాజాగా ఒక రిపోర్ట్ ను విడుద‌ల చేశాయి. సదరు జాబితాలో ఎక్కువ క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న తొలి ఐదుగురిలో తెలంగాణ సీఎం కేసీఆర్ పేరు కూడా ఉంది.

ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్ నివేదిక ప్రకారం.. కేసీఆర్ పై 64 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, వాటిలో 37 తీవ్రమైన IPC సెక్ష‌న్లు కలిగి ఉన్నాయని వెల్ల‌డించారు. అత్యధిక క్రిమినల్ కేసులున్న టాప్ ఐదుగురు ప్రజాప్రతినిధుల్లో కేరళ ఎంపీ డీన్ కురియకోస్ 204 కేసులతో మొద‌టి స్థానంలో ఉన్నారు. 99 పెండింగ్‌ కేసులతో (తమిళనాడు) డీఎంకే ఎంపీ ఎస్‌.కతిరవన్‌ రెండో స్థానంలో ఉన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే మహ్మద్‌ ఆజం ఖాన్‌ 87 కేసుల‌తో మూడో స్థానంలో ఉన్నారు. మరో తమిళనాడు ఎమ్మెల్యే ప్రిన్స్‌ జేజీ 73 కేసులతో నాలుగో స్థానంలో ఉండగా, 64 క్రిమినల్ కేసులతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఐదో స్థానంలో నిలిచారు.