మందు తాగించిన ఎమ్మెల్యేపై కేసీఆర్ సీరియస్ - MicTv.in - Telugu News
mictv telugu

మందు తాగించిన ఎమ్మెల్యేపై కేసీఆర్ సీరియస్

March 22, 2022

01

మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ అయ్యారు. హోళీ పండుగ రోజు ఎమ్మెల్యే తన అనుచరులకు, కార్యకర్తలకు బహిరంగంగా మందు నోట్లో పోస్తూ, డ్యాన్సులు చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పలువురు శంకర్ నాయక్‌ను విమర్శించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే మీపై చాలా రకాలుగా ఫిర్యాదులు వచ్చాయని, పార్టీలో క్రమశిక్షణ చాలా ముఖ్యమని మందలించారు. పార్టీకి నష్టం కలిగించే పనులు చేయరాదని హెచ్చరించారు. ఇంకోసారి ఇలాంటి పనులు చేసినట్లయితే పార్టీ నుంచి బహిష్కరిస్తానని ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై మండిపడ్డారు.