CM kcr announced in the assembly that VRA’s problems will be solved within a week
mictv telugu

మరో వీఆర్ఏ ఆత్మహత్య.. స్పందించిన కేసీఆర్

September 12, 2022

 

జీతాలు రాక, కుటుంబాన్ని పోషించలేక.. ఆందోళనలు చేపట్టిన వీఆర్ఏలు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి గ్రామానికి చెందిన కంచర్ల వెంకటేశ్వర్లు, కామారెడ్డి జిల్లా లింగాపూర్‌కు చెందిన రాగుల రవి వీఆర్‌ఏగా విధులు నిర్వర్తిస్తున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం వీఆర్‌ఏలు చేపట్టిన దీక్షల్లోనూ పాల్గొన్న వీరిద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారు.

గ‌త 50 రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా వీఆర్ఏలు పే స్కేల్ అమలు చేయాల‌ని నిర‌వ‌దిక స‌మ్మే చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టు కోవాల‌ని ఆందోళ‌న‌కు దిగారు. వారం వ్యవధిలో ఇద్దరు వీఆర్‌ఏలు బలవన్మరణానికి పాల్పడంతో వీఆర్‌ఏల కుటుంబాలు ఆందోళ‌న చెందుతున్నాయి. ఇల్లు గ‌డ‌వ‌డం కూడా క‌ష్టాంగా మారిందని వీఆర్‌ఏల కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏ ల‌కు పే స్కేల్ ఇస్తామ‌ని మాటా ఇచ్చారు. ఆ మాట‌ను నిల‌బెట్టు కోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు. మా న్యాయ‌మైన డిమాండ్ నెరవేరే వ‌ర‌కు ఈ ఆందోళ‌న‌లు కోన‌సాగిస్తామ‌ని వీఆర్ఏ ల సంఘం నాయ‌కులు చెబుతున్నారు. ఓ వైపు రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి డిమాండ్లపై సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు తెచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్‌ అందరికి ఉద్యోగాలు కల్పిస్తామని.. వారం రోజుల్లో వారి సమస్యకు తగిన పరిష్కారం చూస్తామని మరోసారి మాటిచ్చారు.