CM KCR announced that the cutoff marks for SC and ST candidates will be reduced in the police recruitment exam.
mictv telugu

బ్రేకింగ్..కానిస్టేబుల్ కటాఫ్ మార్కులు తగ్గింపు

September 12, 2022

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే జరిగిన కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల్లో కటాఫ్‌ మార్కులు తగ్గించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా పలు సంఘాలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎస్పీ, ఎస్టీ వారికి 20 శాతం మార్కులు తగ్గించాలంటూ ఆయా సంఘాల నాయకులు, అభ్యర్థులు నిరసనలు చేశారు. పోలీసు నియామక మండలి అధికారులకు వినతపత్రాలను అందజేశారు.

ఈ క్రమంలో ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్‌ స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా కానిస్టేబుల్‌ ప్రలిమినరీ పరీక్ష రాసిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్ చెప్పారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కానిస్టేబుల్ పరీక్షలో కటాఫ్‌ మార్కులను తగ్గిస్తామని ప్రకటించారు.

అంతకుముందు పోలీసు రిక్రూట్‌మెంట్ పరీక్షలో కటాఫ్ మార్కులు తగ్గించాలని హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని మినిస్టర్ కార్వర్ట్స్‌ ముట్టడిని ఎమ్మార్పీఎస్‌ నేతలు యత్నించిన విషయం తెలిసిందే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 20 మార్కులు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనల నడుమ సీఎం కేసీఆర్ కటాఫ్ మార్కులు తగ్గించనున్నట్లు ప్రకటించడంతో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.