తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పరామర్శించారు. గంగుల కమలాకర్ తండ్రి మల్లయ్య జనవరి 4వ తేదీన కన్నుమూశారు. ఈరో జు కరీంనగర్లోని కేఎస్ఎల్ గార్డెన్స్ లో ద్వాదశ దిన కర్మ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం.. మంత్రి గంగులను పరామర్శించారు.
హైదరాబాద్ నుండి హెలికాప్టర్ లో కరీంనగర్ పిటిసికి చేరుకున్న ముఖ్యమంత్రి.. రోడ్డు మార్గం ద్వారా కొండ సత్యలక్ష్మి గార్డెన్ కు చేరుకున్నారు. ఇటీవల స్వర్గస్తులైన గంగుల మల్లయ్య పెద్ద కర్మకు హాజరై ఆయన చిత్రపటానికి సీఎం కేసీఆర్ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. మల్లయ్య కుమారులైన మంత్రి గంగుల కమలాకర్, ఆయన సోదరులు గంగుల వెంకన్న,సుధాకర్ లతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. సీఎం వెంట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు సుంకే రవిశంకర్, రసమయి బాలకిషన్, మేయర్ సునీల్ రావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమ అనంతరం సీఎం కేసీఆర్ తిరిగి హైదరాబాద్ పయనమయ్యారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ మైదానం నుండి హెలికాప్టర్ లో హైదరాబాద్ బయలుదేరారు.