CM Kcr Birthday celebrations: Brs Mla Kaleru Venkatesh Escaped Danger
mictv telugu

కేసీఆర్ బర్త్‌డే వేడుకల్లో అపశ్రుతి.. ఎమ్మెల్యేకు గాయాలు!!

February 17, 2023

CM Kcr Birthday celebrations: Brs Mla Kaleru Venkatesh Escaped Danger

సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. కాచిగూడలో జరిగిన కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టపాసులు పేలుస్తుండగా నిప్పురవ్వలు గ్యాస్‌ బెలూన్లపై పడి బెలూన్లు పేలాయి. గ్యాస్ నిండిన బెలూన్లు కావడం, భారీ శబ్ధంతో పేలడంతో ఎమ్మెల్యే వెంకటేష్ సహ బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడి నుండి పరిగెత్తారు. ఈ సమయంలో వారంతా కిందపడ్డారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే వెంకటేష్ కి స్వల్ప గాయాలయ్యాయి.

ఎమ్మెల్యే పరిగెత్తడంతో తృటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో ఆనందోత్సహాల మధ్య జరగాల్సిన కేసీఆర్ బర్త్ డే వేడుకలు గందరగోళంగా మారాయి. ఎమ్మెల్యే గ్యాస్ బెలూన్లు గాలిలో వదిలేస్తుండగా.. అదే సమయంలో కార్యకర్తలు బాణాసంచా కాల్చారు. బాణాసంచాల నుంచి వచ్చిన నిప్పు రవ్వలు గ్యాస్ బెలూన్‌పై పడటంతో గ్యాస్ బెలూన్లు ఒక్కసారిగా పేలిపోయాయి. దీంతో భయభ్రాంతులకు గురైన ఎమ్మెల్యేతో పాటు కార్పొరేటర్, కార్యకర్తలు అక్కడి నుండి పరుగెత్తారు.