తెలంగాణ గవర్నర్ తమిళిసైపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగులో కీలక వ్యాఖ్యలు చేసినట్టు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. గవర్నర్ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మంత్రులతో అన్నట్టు సమాచారం. అంతేకాక, ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేసేలా ప్రవర్తిస్తున్నారని, చాలా అంశాలపై వితండవాదం చేస్తున్నారని మండిపడినట్టు ఆయా వర్గాలు చెప్తున్నాయి. అసలు ప్రభుత్వంతో ఏమాత్రం సంబంధం లేనట్టు ఆమె ప్రవర్త ఉందని చెప్పినట్టు తెలుస్తోంది. కాగా, ఇవ్వాళ కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కోమటిరెడ్డి, జగ్గారెడ్డి, గీతారెడ్డి, మధుయాష్కీ, హనుమంతరావులు గవర్నర్ను కలిశారు. నిరుద్యోగం, 111 జీవో ఎత్తివేయడం, డ్రగ్స్, విద్యుత్ ఛార్జీల పెంపు వంటి అంశాలపై ఫిర్యాదు చేశారు.