మహబూబ్నగర్ పర్యటనలో సీఎం కేసీఆర్ మరోసారి మోడీ, బీజేపీ టార్గెట్గా విమర్శలు గుప్పించారు. మంచి నాయకులు, ప్రతిపక్షాలపై కేంద్ర ప్రభుత్వం దాడులు చేయించి భయపెట్టాలని చూస్తుందని మండిపడ్డారు. దేశంలో ప్రజల మధ్య చీలికలు తెచ్చి విద్వేషాలు, భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. కేంద్రాన్ని ప్రశ్నిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలగొడతామని మోదీయే అన్నారంటూ కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రశ్నించిన ప్రభుత్వాన్ని పడగొట్టడమే మోడీ విధానామా ? అని కేసీఆర్ నిలదీశారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ పార్టీకి 40 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని మోడీ చెప్పడం వెనుక ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు హైదరాబాద్ వచ్చి దొంగలు ప్రయత్నిస్తే దొరకబట్టి జైళ్లా వేశాం అని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ నేతలు ఏమీ చేయరని, చేసేవారి కాళ్లల్లో కట్టెలు పెడతారని సీఎం కేసీఆర్ దుయ్యబట్టారు.