కార్మికులతో చర్చలకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్! - MicTv.in - Telugu News
mictv telugu

కార్మికులతో చర్చలకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్!

October 25, 2019

ts rtc.

ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డ విషయం తెలిసిందే. కార్మికులు తమ సంస్థను తామే నాశనం చేసుకుంటున్నారని కేసీఆర్ సమ్మెను, సమ్మెను నడుపుతున్న యూనియన్లను దుయ్యబట్టారు. అయితే ముఖ్యమంత్రి మొండి వైఖరికి తాము కూడా ఏమాత్రం తగ్గేదిలేదని కార్మిక సంఘాల జేఏసీ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో ఏం జరుగుతోందనే డోలాయమానంలో ప్రజలు పడ్డారు. కార్మికులు తమ భవిష్యత్ కార్యాచరణపై ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారనే అంశంపై ఆసక్తి నెలకొంది. 

ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకొచ్చే బాధ్యతను కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలకు అప్పగించినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలు తమ పరిధిలోని ఆర్టీసీ డిపోలకు చెందిన కార్మికులు, కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరిపి… వారు విధుల్లో చేరేలా ఒప్పించాలని కేసీఆర్ ఆదేశించినట్టు సమాచారం. ఇదిలావుండగా రేపు ఉదయం 11 గంటలకు బస్ భవన్ లేదా రవాణా శాఖ కార్యాలయంలో కార్మికులతో ఆర్టీసీ ఎండీ చర్చలు జరపే అవకాశాలు వున్నాయని తెలుస్తోంది.