కేసీఆర్ సభ రద్దు.. కరుణించని వరుణుడు  - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ సభ రద్దు.. కరుణించని వరుణుడు 

October 17, 2019

Cm kcr

హుజూర్ నగర్ ఉప ఎన్నికల కోసం టీఆర్ఎస్ ఈ రోజు నిర్వహించతలపెట్టిన సీఎం కేసీఆర్ బహిరంగ సభ రద్దయింది. వర్షం పడుతుండడంతో హెలికాప్టర్ ప్రయాణానికి ఏవియేషన్ అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో సీఎం సభను రద్దు చేసుకున్నారు. రెండు గంటలకుపై కుండపోతగా వర్షం కురుస్తుండటంతో సభాప్రాంగణం అస్తవ్యస్తంగా మారిపోయింది. నీళ్లు చేరి.. బురదమయంగా అయింది. జనం కుర్చీలను తలపై పెట్టుకుని పరుగులు తీశారు.హుజూర్ నగర్‌ ఎన్నికల  ప్రచారంలో కేసీఆర్ ఇంతవరకు ప్రచారం చెయ్యలేదు. ఈ నెల 21న అక్కడ పోలింగ్ జరగనుంది. 19వ తేదీతో ప్రచారం ముగియనుంది. దీంతో సీఎం సభపై సందేహాలు తలెత్తుతున్నాయి. హుజూర్ నగర్‌లో టీఆర్ఎస్‌కు మద్దతు ప్రకటించిన సీపీఐ, ఆర్టీసీ సమ్మె కారణంగా ఉపసంహరించుకోవడం తెలిసిందే. ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గులాబీ దళం గెలుపు కోసం సర్వశక్తులను ఒడ్డి పోరాడుతోంది. సీఎం స్వయంగా ప్రచారం చేస్తే పార్టీకి గెలుపు అవకాశాలు పెరుగుతాయని కార్యకర్తలు భావిస్తున్నారు. 

44