CM kcr inaugurated independence day diamond jubilee celebrations in telangana today
mictv telugu

స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ప్రారంభించిన సీఎం కేసీఆర్

August 8, 2022

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో ఘనంగా ప్రారంభించారు. హెచ్ఐసీసీకి చేరుకున్న కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం భరతమాత చిత్రపటానికి పూలమాల వేసి వజ్రోత్సవ వేడుకలకు శ్రీకారం చుట్టారు. ఈ వేడుకల్లో భాగంగా 15 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించినున్నట్లు కేసీఆర్ తెలిపారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వేదికపై 75 మంది కళాకారులతో నిర్వహించిన వీణావాయిద్య ప్రదర్శన వీక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. శాండ్‌ ఆర్ట్‌తో స్వతంత్ర పోరాట ఘట్టాల ప్రదర్శన అందర్ని భావోద్వేగానికి గురి చేసింది. వేదికపై దేశభక్తి ప్రబోధ నృత్యం, ఫ్యూజన్ డ్యాన్స్, లేజర్ షో అలరించాయి. కార్యక్రమంలో ఉత్సవాల కమిటీ చైర్మన్‌, ఎంపీ కే కేశవరావు, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.