మహబూబ్‌నగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. భారీ కాన్వాయ్‌తో ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరి వెళ్లిన సీఎం.. మొదట పాలమూరు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. టీఆర్ఎస్ జెండా ఎగుర వేసి.. అక్కడ ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా పట్టణ శివారులోని పాలకొండ వద్ద 22 ఎకరాల్లో రూ.55 కోట్లతో నిర్మించిన నూతన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడే జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు.
చాంబర్లో కలెక్టర్ వెంకట్రావ్‌ను సీట్లో కూర్చుండబెట్టి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టరేట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు చెందిన పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు పాల్గొన్నారు. అంతకు ముందు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి ప్రారంభోత్సవం చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు చెందిన పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు పాల్గొన్నారు. సాయంత్రం 4 గంటలకు ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో పాలమూరు పట్టణం కొత్త శోభ సంతరించుకుంది.