CM KCR MasterMind..BJP SlientMode In 2023 Elections..?
mictv telugu

ఇక బీజేపీ సైలెంట్ మోడ్..?

November 1, 2022

 

బీజేపీ దూకుడు తగ్గించబోతుందా?ఎటాకింగ్ మోడ్ మార్చేయబోతుందా?2023 రేసుని లైట్ తీసుకోబోతోందా? ఆ రెండు భయాలు పార్టీని వెంటాడుతున్నాయా?ఇంతకీ బీజేపీని వణికిస్తున్న ఆ రెండు అంశాలు ఏంటి? ఇందులో వాస్తవమెంత?

భవిష్యత్‌లో బీజేపీ

తెలంగాణలో బీజేపీ జోరుమీదుంది. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఓ రేంజ్‌లో ఎటాక్ చేస్తుంది. ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. కాంగ్రెస్‌ని మచ్చుకైనా గుర్తురాకుండా చేస్తోంది. విపక్షమంటే బీజేపీ..బీజేపీ అంటే విపక్షం అనే లెవల్‌కు తీసుకెళ్లింది.దుబ్బాక నుంచి మునుగోడు బైపోల్ దాకా ఇదే సాగింది. ఇదంతా ఇప్పటిదాకా..భవిష్యత్‌లో బీజేపీ ఇలా ఉండబోదా?ఎటాకింగ్ స్పీడ్‌ని తగ్గించబోతుందా? అవుననే అంటున్నాయి గులాబీ వర్గాలు. బీజేపీకి టీఆర్ఎస్‌కు లింకేంటి అనుకుంటన్నారా?ఇక్కడే ఉంది అసలు మతలబు.

లెక్క తప్పిందా?

తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ. ఏ పోరు అయినా ఇంతే. జీహెచ్ఎంసీ ఎన్నికల నుంచి మునుగోడు ఉప ఎన్నిక దాకా ఇంతే. రాష్ట్రంలో అధికారిక టీఆర్ఎస్‌కు గట్టిపోటీనిచ్చింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అంటూ ముందుకెళ్తుంది. 2023లో అధికారంలో వచ్చితీరుతామని ధీమా వ్యక్తం చేసింది. రేసులో టీఆర్ఎస్ బీజేపీయే ఉంటాయని, కాంగ్రెస్ కనీస పోటీ ఇవ్వలేదని కమలం నేతలు చెప్పుకుంటు వస్తున్నారు. కానీ…

కమలంలో కలవరం…

ఫామ్‌హౌజ్ ప్రకంపం రాజకీయాలను ఏమోగానీ బీజేపీని గట్టిగా తాకింది. పైకి కవరింగ్ చేస్తున్నా..కలరింగ్ ఇస్తున్నా లోలోపల టెన్షన్ పడుతోందట. తెలంగాణ బీజేపీనే కాదు..పార్టీ హైకమాండ్ కలవరపడుతుందట. ఫామ్‌హౌజ్ స్కెచ్ కమలం నేతల్ని షేక్ చేస్తుందట. అందుకే బీజేపీ జాతీయ నేతలు దీనిపై స్పందించలేదని టాక్.దీన్నే టీఆర్ఎస్ అస్త్రంగా మార్చుకోబోతోంది.

బీజేపీ గుట్టు గులాబీ చేతిలో…

ఫామ్‌హౌజ్ ఎపిసోడ్‌తో బీజేపీ జట్టు సీఎం కేసీఆర్ చేతికి చిక్కిందంట. “ఇక ముందు బీజేపీ ఆటలు సాగవు..ఆ పార్టీ మనల్ని ఏం చేయలేదు. రాబోయే ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేదు. ఆ పార్టీ గుట్టు అంతా మనచేతుల్లోనే ఉంది. ఇంతకు ముందులా బీజేపీ మనపై ఎటాకింగ్ చేయకపోవచ్చు”అని టీఆర్ఎస్ కార్యకర్తలు అనుకుంటున్నారట.

మునుగోడు సభలోనూ…

మొన్న మునుగోడు సభలోనూ ఇదే అర్థం వచ్చేలా సీఎం కేసీఆర్ స్పీచ్ సాగింది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొనేందుకు బీజేపీ పెద్దలు ప్రయత్నించారని ఆరోపించారు. వారి కుట్రల్ని టీఆర్ఎస్ నలుగురు ఎమ్మెల్యేలు ఎడమ కాలి చెప్పుతో తిప్పికొట్టారని చెప్పారు. అంతేకాదు అమిత్ షా పై కూడా కేసీఆర్ పదునైన అస్త్రాలు సంధించారు.

రెండో భయం ఇదే

ఇంతేకాదు మరో అంశం తెలంగాణ బీజేపీని వేధిస్తుంది. రాహుల్ జోడో యాత్ర ఆ పార్టీని ఆందోళన పరుస్తోంది. రాహుల్ యాత్రకు వచ్చిన స్పందన చూసి తెలంగాణ బీజేపీ ఆలోచనలో పడిందట. చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ద్వితీయ స్థానంలో ఉంది. పలు సర్వేలలో ఇదే తేటతెల్లమైంది. ఈ విషయం కూడా బీజేపీని కలవరపెడుతోందట. ఈ రెండు అంశాలతో ఇంతకు ముందులా బీజేపీ దూకుడుగా ఉండకపోవచ్చని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.