2,3 నెలల్లో సంచలన వార్త చెప్తా : కేసీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

2,3 నెలల్లో సంచలన వార్త చెప్తా : కేసీఆర్

May 26, 2022

దేశంలో మార్పు తప్పకుండా వస్తుందని, దిగజారిపోయిన పరిస్థితిని ప్రజలు బాగా గమనిసున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ఆయన గురువారం బెంగళూరులో మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామిలతో భేటీ అయ్యాక విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే..

‘అధిక ధరలు, ద్రవ్యోల్బణం, రూపాయి పతనంతో పరిస్థితి పూర్తిగా దిగజారింది. దేశం మారుతోంది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మార్పు తథ్యం. రెండు, మూడు నెలల్లో సంచలన వార్త వింటారు. దేశ పరిస్థితి బాగాలేదని గణాంకాలు చెబుతున్నాయి. చైనా జీడీపీ ఒకప్పుడు మనకంటే తక్కువ. ఇప్పుడు 16 మిలియన్ డాలర్లకు చేరింది. మనది 5 మిలియన్ డాలర్లే. దీనికంటే పెద్ద అవమానం మరొకటి ఉండదు. ఎన్ని వనరులున్నా మనం వాడుకోలేకపోతున్నాం. ప్రజలు సంతోషంగా లేరు. సరైన సమయంలో సరైన పరిణామం వస్తుంది. దేశం మారుతుంది’ అని కేసీఆర్ అన్నారు. దేవెగౌడ, కుమారస్వామిలతో చర్చల అనంతరం కేసీఆర్ హైదరాబాద్ కు బయల్దేరారు.