CM KCR mentioned about BRS in Bangarigadda TRS public meeting
mictv telugu

బీఆర్ఎస్ పునాదిరాయి మునుగోడు ఉప ఎన్నిక

October 30, 2022

దేశ రాజకీయాలను మలుపుతిప్పే సువర్ణావకాశం మునుగోడు ప్రజలకు వచ్చిందన్నారు సీఎం కేసీఆర్. చండూరు మండలం బంగారిగడ్డలో నిర్వహించిన టీఆర్ఎస్ భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తూ… తెలంగాణ మాదిరిగానే భారత్‌ను చేయాలని పుట్టుకొచ్చిందే బీఆర్‌ఎస్‌ అని అన్నారు. భారతదేశ రాజకీయాలకు పునాదిరాయి వేసే అవకాశం మునుగోడుకే దక్కింది. దేశంలో జరిగే పోరాటంలో మీరే పునాది రాయి వేయాలి. మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టితో గెలిపించి ప్రోత్సహించాలి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తవాలి. ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే 15 రోజుల్లో మీ కోరిక నెరవేరుస్తా. ప్రజల్లో ఉండే మనిషిని ఓడించి.. రాజగోపాల్ రెడ్డిని 2018లో గెలిపించారు. గొడ్డలిని గెలిపించారు అభివృద్ది లేదు. రోడ్లన్నీ బాగుచేస్తా. గెలిచినవారు పత్తా లేరు. ఆనాడు ఓడిన ప్రభాకర్ రెడ్డి మీతోనే ఉన్నారు. మీ కష్టంలో, దు:ఖంలో ఉన్నారు, చావులకు వచ్చారు, లగ్గాలకు వచ్చారు. ఆయన్ని గెలిపించండి” అని కోరారు.

“మునుగోడును కడుపులో పెట్టుకుంటా. ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి.. మునుగోడులో ప్రతి ఎకరానికి నీళ్లు తెచ్చే బాధ్యత నాది. వంద పడకల ఆస్పత్రి, చండూరు రెవిన్యూ డివిజన్ ఇస్తా. కృష్ణా జలాల్లో మా వాటా తేల్చేందుకు మోదీకి ఎనిమిదేళ్లు సరిపోలేదా?. రాష్ట్రంలో వడ్లు కొనని మోదీ సర్కారుకు రూ. వందల కోట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను కొనడం చేతనవుతోంది. రూపాయి విలువ పతనానికి కారణం ఎవరు? గ్యాస్‌, పెట్రోల్‌ ధర పెరిగింది, నిత్యావసరాల ధరలు పెరిగాయి, చేనేతపై జీఎస్టీ వేశారు. వీటిపై మీరు పోరాడాలి. విద్యుత్‌ ప్రైవేటీకరణ జరిగితే దారుణ ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుంది” అని సీఎం అన్నారు.