హస్తినలో కేసిఆర్ హల్ చల్ ! - MicTv.in - Telugu News
mictv telugu

హస్తినలో కేసిఆర్ హల్ చల్ !

July 26, 2017

14 వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న రామ్ నాథ్ సింగ్ ను అభినందించడానికి హస్తిన వెళ్లిన సీఎం కేసిఆర్ అక్కడ చాలా బిజీ షెడ్యూల్లో గడిపారు. వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన ముఖ్యమంత్రులతో కార్యక్రమం ఆసాంతం ఆసక్తిగా సాగింది. ఆ తర్వాత సీఎం కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటి అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనున్న థర్మల్ ప్రాజెక్టులన్నీ సత్వరమే పూర్తి చెయ్యాలని విజ్ఞప్తి చేసారు.

అలాగే ప్రధాని మోడీని కూడా కలిసి రాష్ట్ర సమస్యల మీద అలాగే ఆంధ్ర ప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని పెండింగ్ అంశాలను, తెలంగాణ రిజర్వేషన్ చట్టాలను చర్చించారు. మోడీ కూడా సానుకూలంగానే స్పందించినట్టు సమాచారం. పనిలో పనిగా ఉపరాష్ట్రపతి అభ్యర్థి అయిన వెంకయ్యనాయుడును కూడా కలుసుకొని బిజీబిజీగా హస్తినలో హల్ చల్ చేసారు కేసిఆర్.