వ్యవసాయేతర ఆస్తులకు పాస్ పుస్తకాలు.. సీఎం కేసీఆర్ నిర్ణయం - MicTv.in - Telugu News
mictv telugu

వ్యవసాయేతర ఆస్తులకు పాస్ పుస్తకాలు.. సీఎం కేసీఆర్ నిర్ణయం

September 24, 2020

nvgbn

వ్యవసాయేతర ఆస్తులకు కూడా పాస్ పుస్తకాలు ఇవ్వాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్లు, ఫామ్ హౌజ్‌లు తదితర వ్యవసాయేతర భూములకు కూడా ఈ  సదుపాయం కల్పిస్తామన్నారు. ఉచితంగానే వీటిని పొందేందుకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్ ద్వారా మ్యూటేషన్ చేయించుకోవాలని అన్నారు. దీంతో  దేశంలోనే తొలిసారిగా వ్యవసాయేతర ఆస్తులకు పాస్ పుస్తకాలు ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది. 

త్వరలోనే కొత్త రెవెన్యూ చట్టం అమలులోకి రానున్న నేపథ్యంలో అధికారులతో సమీక్ష సందర్భంగా ఈ నిర్ణయం వెల్లడించారు. ఇక నుంచి వ్యవసాయేతర భూముల విషయంలోనూ వివాదాలు లేకుండా చేయనున్నారు. వీటి కోసం మెరూన్ కలర్ పట్టాదార్ పాస్ పుస్తకాలు జారీ చేయనున్నట్లు సీఎం తెలిపారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు సహా అన్ని పరిధిలోని ఇళ్లు, ప్లాట్లు మ్యూటేషన్ చేసుకోవాలన్నారు. ఇక నుంచి ఏ తరహా రిజిస్ట్రేషన్ అయినా ధరణి పోర్టల్ ద్వారానే జరుగుతుందని చెప్పారు. దీనివల్ల నిరుపేదల ఇంటి స్థలాలకు రక్షణ ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు.