CM KCR ordered to conduct the last rites of Krishnamraju with official ceremonies
mictv telugu

ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణంరాజు అంత్యక్రియలు.. సీఎం కేసీఆర్ ఆదేశం

September 11, 2022

 


కృష్ణంరాజు మరణం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాప వ్యక్తం చేశారు. తెలుగు సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్న సీఎం.. కృష్ణంరాజు మరణం బాధాకరమన్నారు. కృష్ణంరాజు అంత్యక్రియలను హైదరాబాద్‌లోనే నిర్వహించునన్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అధికార లాంఛనాలతో కృష్ణంరాజు అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కృష్ణంరాజు కేంద్ర మాజీ మంత్రి మాత్రమే కాదని, తనకు అత్యంత ఆప్త మిత్రుడని కేసీఆర్‌ అన్నారు. సీఎం ఆదేశాలతో కృష్ణంరాజు అంత్యక్రియలకు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఏర్పాట్లు చేపట్టారు.

కృష్ణంరాజుకు ముగ్గురు కుమార్తెలు ఉండగా.. ఒక కుమార్తె విదేశాల్లో ఉంటున్నారు. ఆమె రావడానికి సమయం పడుతుంది. దీంతో సోమవారం మధ్యాహ్నం మహాప్రస్థానంలో కృష్ణంరాజు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మరికాసేపట్లో ఆయన భౌతిక కాయాన్ని నివాసానికి తరలించనున్నారు. అక్కడి నుంచి జనం సందర్శనార్థం యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర రెడ్డి స్టేడియంలో ఆయన పార్థీవ దేహాన్ని ఉంచుతారు.