CM KCR performed a special pooja at the Gurdwara wearing a turban
mictv telugu

తలపాగాలో సీఎం కేసీఆర్.. సోషల్ మీడియాలో వైరల్

September 1, 2022

బుధవారం బిహార్ పర్యటనలో తెలంగాణ సీఎం కేసీఆర్ బిజీబిజీగా గ‌డిపారు. బుధ‌వారం మ‌ధ్యాహ్నం బీహార్ రాజ‌ధాని పాట్నా చేరుకున్న కేసీఆర్‌…. ముందుగా ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్‌, డిప్యూటీ సీఎం తేజ‌స్వీ యాద‌వ్‌ల‌ను కలిశారు. ఆ తర్వాత వారితో క‌లిసి గ‌ల్వాన్ లోయ అమ‌ర వీరుల కుటుంబాల‌కు ప‌రిహారం చెక్కుల‌ను పంపిణీ చేశారు. అనంత‌రం జాతీయ రాజ‌కీయాల‌పై వారితో చ‌ర్చ‌లు జ‌రిపిన కేసీఆర్‌… త‌ద‌నంత‌రం ఆర్జేడీ అధినేత లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌తో భేటీ అయ్యారు.

ఆ త‌ర్వాత బుధ‌వారం సాయంత్రం బీహార్ డిప్యూటీ సీఎం తేజ‌స్వీ యాద‌వ్‌తో క‌లిసి పాట్నాలోని గోవింద్ సింగ్ జన్మస్థలం గురుద్వారాను సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా సిక్కులు ధ‌రించే త‌ల‌పాగా ధ‌రించిన కేసీఆర్‌…న్యూ లుక్కులో క‌నిపించారు. త‌న పార్టీ జెండా రంగు అయిన గులాబీ రంగు త‌ల‌పాగాను ధ‌రించిన కేసీఆర్ గురుద్వారాలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. సిక్కుల త‌ల‌పాగాలో క‌నిపించిన కేసీఆర్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఇలాంటి పరిణామం జరగడంతో ఇదే తొలిసారి కావడం విశేషం. అయితే ఈ ఫోటోలు చూసి కొందరు బీజేపీ కార్యకర్తలు.. గతంలో మోడీ ఇలాంటి వేషధారణలో కనిపిస్తే కేసీఆర్ విమర్శలు చేశారని, ఇప్పుడు ఆయన చేస్తున్నదేంటని కౌంటర్లు వేస్తున్నారు.